రవితేజ ఫ్యాన్స్‌కు అలర్ట్.. ఈనెల 17న ‘టైగర్ నాగేశ్వరరావు’ దండయాత్ర

  • రవితేజ నటిస్తున్న తొలి పాన్ ఇండియా చిత్రం
  • అభిషేక్ అగర్వాల్ నిర్మాణంలో రూపొందిస్తున్న వంశీ
  • అక్టోబర్ 20న విడుదల కానున్న చిత్రం
రవితేజ తన కెరీర్లో తొలిసారి చేస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కశ్మీర్ ఫైల్స్, కార్తికేయ2 నిర్మాత అభిషేక్ అగర్వాల్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. నూపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో రేణు దేశాయ్ కీలకపాత్ర పోషిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. దసరా కానుకగా అక్టోబర్ 20న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సినిమా విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో రవితేజ స్టూవర్టుపురం గజ దొంగగా పేరుగాంచిన నాగేశ్వరరావు పాత్రలో నటిస్తున్నాడు. 

ఈనెల 17న సినిమా టీజర్ రిలీజ్‌ చేయనున్నట్టు దర్శకుడు వంశీ ప్రకటించాడు. ‘తమ్ముళ్లు నాకు మీ ఆవేశం, ఆక్రోశం అర్థమైంది. కానీ లోకంలో కొన్ని మంచి విషయాలు జరగాలంటే కొంత సమయం తీసుకుంటుంది. మీరు అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరి ఆకలి చూసి ఈ అప్డేట్ ఇస్తున్నాము. ఇన్ని రోజులు ఓపికగా వెయిట్ చేసినందుకు ధన్యవాదాలు . ఇక మొదలెడదామా ’ అని ట్వీట్ చేశాడు. టైగర్ దండయాత్ర’ అంటూ ఓ కొత్త పోస్టర్‌‌ను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇందులో ‘టైగర్ నాగేశ్వరరావు’ రాకకు చిహ్నంగా రవితేజ పాదాన్ని చూపించారు.

Raviteja
Tiger nageshwar rao
teaser
Tollywood
pan india

More Telugu News